NewsWaves.news

అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులకు స్వదేశీ ప్రయాణానికి అనుమతి..

నకిలీ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన 16 మంది తెలుగు విద్యార్థులను ఫిబ్రవరి 26వ తేదీలోగా స్వదేశాలకు వెళ్లేందుకు అక్కడి కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం 20 మంది విద్యార్థులు అరెస్ట్ అవగా అందులో ముగ్గురు విద్యార్థులను ఇంతకుమునుపే స్వదేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.ఇక మిగిలిన 17 మంది పై మంగళవారం రోజు విచారణ జరుగగా.. వారిలో 15 మందికి కోర్టు అవకాశాన్ని ఇచ్చింది.

మరో విద్యార్థికి కూడా యుఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతిని ఇవ్వగా, 17వ విద్యార్థి యూఎస్ సిటిజన్ ని పెళ్లి చేసుకోవడంతో అతను బెయిల్ బాండ్ కోసం అప్లై చేసుకున్నాడు. మొత్తం 16 మంది తెలుగు విద్యార్థులు స్వదేశానికి ప్రయాణం అయ్యేందుకు అవసరమైన టికెట్ల బుకింగ్, టైమింగ్ మొదలైన వివరాలను జైల్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కి విద్యార్థులు ముందుగానే సమాచారం ఇవ్వవలసి ఉంటుందనీ.. దాని ప్రకారమే అధికారులు విద్యార్థులను జైలు నుండి విమానాశ్రయానికి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తారని సమాచారం.

Related Articles