NewsWaves.news

అఖిల్ నాలుగో చిత్రం ప్రారంభం.

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. అక్కినేని ఫ్యామిలీలో సూపర్ స్టార్ అవతరించారని అక్కినేని అభిమానులు భావించారు. కానీ అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు .దాంతో అఖిల్ డీలా పడ్డాడు. తర్వాత చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. అఖిల్ కొత్త సినిమా ప్రారంభమైంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. గోపీ సుందర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. జీఏ 2 ప్రొడక్షన్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పించబోతున్నారు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. చిత్ర బృందంతోపాటు నాగార్జున, అమల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.మిగితా నటీనటులను,సాంకేతిక నిపుణులని త్వరలో తెలియజేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *